అగ్నిధార: ప్రతినిధి, పెద్దపల్లి మండలం  కొత్తపల్లి గ్రామంలో అతి పురాతనమైన సోమలింగేశ్వర శివాలయం నిత్యం పూజలందుకుంటూ ప్రజల కోరికలు తీర్చే కొంగుబంగారంగావిరాజిల్లుతుంది అరుదుగా కనిపించే కోవెలలో ఒకటైనా సోమలింగేశ్వర స్వామి ఆలయం కొత్తపల్లి గ్రామంలో ఉండడం గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు ఊరికి ఈశాన్యంలో వేలిసినటువంటి దేవాలయం అతి పురాతనమైనదిగా మనకు చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తుంది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన విగ్రహాలను చూస్తే ఇట్టే మనకు తెలుస్తుంది శివుని ముందు నందీశ్వరుడు వినాయకుడు గంగమ్మ తల్లి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి వందల సంవత్సరాల కింద   ఆ ప్రాంతమంత నిత్య పూజలతో కళకళలాడింది అనడానికి ఆనవాళ్లు కనబడతాయి అందులో ముఖ్యంగా సోమ లింగేశ్వర స్వామి ఆలయానికి కుడి వైపున చెరువు ఆచెరువు నీరు కోవెలకు పడమర నుండి ఉత్తరం వరకు ఉత్తరం నుండి తూర్పు వైపుకు ప్రవహించినటువంటి ఆధారాలు నేటికి కనపడతాయి అంటే సోమేశ్వర ఆలయం చుట్టూ నీరు ప్రవహించేది ఆలయానికి వచ్చే భక్తులందరూ స్నానాలు చేయుటకు అనువైన ప్రదేశంగా భావించవచ్చు కాలగర్భంలో కనుమరుగైపోతున్న టువంటి విగ్రహాలను కొత్తపల్లి ప్రజల సహాయ సహకారాలతో సర్పంచ్ సిరాలపు సత్యం ఆలయానికి పున ప్రతిష్టాపన చేయించారు నిత్యం దూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతుంది ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయానికి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు కోరుతున్నారు