తెలంగాణ గెజిటెడ్ అధికారుల జిల్లా సంఘం ఏర్పాటుః: జిల్లా టిజేఎసి చైర్మన్ బొంకూరి శంకర్.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:సోమవారం రోజున పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రుచి గ్రాండ్ హోటల్ లో పెద్దపెల్లి జిల్లాలోని సమస్త గెజిటెడ్ అధికారులు హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ బొంకూరు శంకర్ హాజరై .తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సంబంధించిన కమిటి ఏర్పాటు చేసామని జిల్లా టిజేఎసి చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. గెజిటెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి అధ్యక్షుడిగా ఎస్టిఒ ఎన్. దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎలిగేడు ఎంపిడిఓ ఆర్. వేణుగోపాల రావు, ఉపాధ్యక్షులుగా అబ్కారీ సిఐ ఎం.శ్రీనివాస్ మెడికల్ అధికారి డాక్టర్ డి.రాజు,డిఎఓ ఎల్. బ్రహ్మానంద రెడ్డి, ఎంఎఓ కె.అలివేలు, కోశాధికారి గా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ .తిరుపతి, జాయింట్ సెక్రటరీలుగా ఐటిఐ రామగుండం ప్రిన్సిపాల్ ఈ.సురెందర్, ఎలిగేడు మండల పంచాయతీ అధికారి అనిల్ రెడ్డి, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, సీడీపీఓ కవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎహెచ్. పెద్దపల్లి డాక్టర్ కుమార్ స్వామి, క్రీడా సాంస్కృతిక సెక్రెటరీ కె.రవికుమార్, పబ్లిసిటీ సెక్రటరీగా మంథని ఎబిసిడబ్ల్యూఓ విజయ్ పాల్ రెడ్డి,ఈ.సి ఎస్ టి ఓ హరీష్, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ ఎం.శ్రీనివాస్, పెద్దపల్లి డిటిఓ ఎంఏ.నాయిమ్ ఎంపికయ్యారు. వీరికి 3 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సమస్త తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగస్థులు కలిసి రావాలని జిల్లా టిజేఎసి చైర్మన్ బొంకూర్ శంకర్ పిలుపునిచ్చారు.
ఇట్టి ఏన్నికల నియమావళి కి లోబడి అద్భుతంగా నిర్వహించినందుకు జిల్లా ఉపాధి కల్పనధికారి వై.తిరుపతి రావుకి ప్రత్యేక మైన కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్జిఒ కార్యదర్శి రాజనరేందర్ తెలంగాణ గెజిటెడ్ అధికారులు తదితరులు పాల్గోన్నారు.
