అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు ప్రవేశపెట్టిన టికెట్ల జాబితా వ్యవహారం లో భాగంగా గత 15 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో ఉంటూ ప్రజా సేవా చేస్తూ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా శ్రేయస్సే ద్యేయం గా పనిచేస్తున్న యువ న్యాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా 70 సంవత్సరాల వ్యక్తికి అవకాశం ఇచ్చి గత 3 పర్యాయాలు గా ఓపిక తో పార్టీ గెలుపు కొరకు కృషి చేసిన నాకు రాజకీయాలలో ఉత్సాహం ఉన్న అవకాశం ఇవ్వకుండా యువకులను అనగదొక్కుతున్న ప్రయత్నానికి చింతించి నేడు బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నారని నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నూటికి నూరు శాతం బరిలో ఉంటున్నానని ప్రజలకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.