అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపల్లి మండలం తుర్కులమద్దికుంటలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ సహాకారంతో తలసేమియా మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సమయానికి రక్తం అందక బాధపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని వారికి సహాయంగా ఉండేందుకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో 25 మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు సయ్యద్ యసార్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే ముందుండి నడిపించారు.ఇక పై కూడా పేద ప్రజలకు సమాజంలో మంచి పనులు చేయడానికి ఫ్రెండ్ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ముందు ఉంటుందని తెలిపారు.వీరిని లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్, కార్యదర్శి లయన్ మాదర్ ఖాన్,కోశాధికారి కట్ట శంకర్ అభినందించారు.