అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ పెద్దపెల్లి ఎన్నికలు నూతన కార్యవర్గం ఎన్నిక ఈరోజు ఎం ఆర్ సి పెద్దపెల్లి నందు జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో 2021 23 సంవత్సరమునకు గాను జిల్లా శాఖ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా శ్రీ సుదర్శన్ ప్రధానోపాధ్యాయులు సుల్తాన్పూర్ 

ప్రధాన కార్యదర్శి గా టి సురేంద్ర కుమార్ జడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి  మరియు కోశాధికారిగా శ్రీ బి శ్రీనివాస్ జడ్.పి.హెచ్.ఎస్ తురకల మద్దికుంట గారు ఎన్నికైనారు ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా శ్రీ కే రాజయ్య ప్రధానోపాధ్యాయులు జడ్.పి.హెచ్.ఎస్ కొలనూరు  నియమించబడ్డారు ఈ సమావేశం లో అధ్యక్షులు శ్రీ సుదర్శన  మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్న ఆంగ్ల మాధ్యమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధించుటకు అనుమతించాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఇప్పటి వరకు అనుమతి కొరకు ప్రతిపాదనలు పంపిన అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే అనుమతిమంజూరుచేయాలనిప్రభుత్వాన్నికోరారు.

ప్రతి పాఠశాలలో ఇంతకు పూర్వం పని చేసిన ప్రత్యేక కార్మికులను తిరిగి పాఠశాలల్లో నియమించి ఈ కోవిడ్ సమయంలో విద్యార్థులకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న కుమార్  ఎన్నికల అధికారి గా శ్రీనివాస్ రెడ్డి  కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వ్యవహరించారు జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయులందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్ వందన సమర్పణలతో సమావేశం ముగిసింది