ముఖ్యమంత్రిని కలిసిన పెరుమాండ్ల సురేష్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పెరుమాండ్ల సురేష్..

అగ్నిధారన్యూస్ తలకొండపల్లి

విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డినీ తలకొండపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ మాట్లాడుతూ..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండుగ, రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజారంజక పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన కొనియాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో విద్య సంక్షేమం, కోసం మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని పెరుమాండ్ల సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ తో పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి కాంగ్రెస్ నాయకులు సైనికుల పనిచేయాలని, సూచించారు.