సాంకేతిక పరిజ్ఞానంతో ఐదు రోజుల్లోనే ఫోన్ గుర్తింపు.

అతి ముఖ్యమైన ఫోన్ తక్కువ సమయంలోనే గుర్తింపు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి.

ఎస్ ఐ మధుకర్ కు కృతజ్ఞతలు తెలిపిన రిపోర్టర్ రాజేందర్ అగ్నిధార యాజమాన్యం.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
ఇటీవల జరిగిన ఒక ఆక్సిడెంట్ లో అగ్నిధార ఆఫీస్ సంబంధించిన అతి ముఖ్యమైన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. పెద్దపల్లి పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ను గుర్తించారు. పోగొట్టుకున్న మొబైల్ గురించి పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  వెంటనే స్పందించిన ఎస్ ఐ మధుకర్ CEIR ( Central equipment identity register ) పోర్టల్ ద్వారా ఫోన్ IMEI ఐఎంఈఐ నెంబర్ ను ట్రాకింగ్ లో పెట్టారు. ఫోన్లో కొత్త సిమ్ యాక్టివేట్ అవ్వగానే వచ్చిన టవర్ లోకేషన్ ఐ ఎం ఈ ఐ ట్రేసింగ్ ఆధారంగా మొబైల్ ఫోన్ ఆచూకీ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ని ఆదివారం రోజు అగ్నిధార రిపోర్టర్ సుల్తానాబాద్ రాజేందర్ కు ఎస్ఐ మధుకర్ అందించారు. ఈ సందర్భంగా S I మధుకర్ కు సహకరించిన సాంకేతిక సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. S I మధుకర్ మాట్లాడుతూ.. అనుకోకుండా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న దొంగిలించబడిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఐఎంఈఐ నెంబర్ సి ఈ ఐ ఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి తిరిగి మొబైల్ పొందవచ్చని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అందిస్తున్న పెద్దపల్లి ఎస్ ఐ మధుకర్….