సర్పంచ్ పోలు వనిత సాయికుమార్ కు అదనపు ఒక లెక్క కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం.
అగ్నిధార:కమాన్పూర్, అక్టోబర్ 09: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామ పంచాయతీ టీబీ రహిత గ్రామంగా నిలిచి జిల్లా స్థాయిలో ప్రశంసలు అందుకుంది.టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో జూలపల్లి గ్రామాన్ని టీబీ ముక్త్ గ్రామంగా ప్రకటిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ రాములు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ పోలు దాసరి వనిత సాయికుమార్ పంచాయతీ గుమ్మడి కార్యదర్శి సదయ్య ప్రశంస పత్రం అందుకున్నారు.గ్రామంలో టీబీ నివారణకు చేపట్టిన చర్యలు, అనుమానిత కేసుల గుర్తింపు, ప్రజల్లో అవగాహన కల్పించడంలో జూలపల్లి పంచాయతీ ముందు వరుసలో నిలిచిందని అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల ఎంపీడీవో సాదినేని ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి గుమ్మడి సదయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రశంస పత్రం అందుకున్న సందర్భంగా సర్పంచ్ వనిత సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని టీబీ రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామాన్ని ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని తెలిపారు.
