అగ్నిధార న్యూస్ పెద్దపల్లి క్రైమ్

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే ఓ ఇంటిలో దొంగలు పడి దాదాపు మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విరాలకు వెళ్తే పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చెరుకు రాజిరెడ్డి, వినోద, ఇద్దరు వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇద్దరు కూతుర్లు వేరే గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామంలో చెరుకు మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర ఒక కార్యక్రమం ఉందని రాజిరెడ్డి వెళ్లిపోయారు. వెళ్లిన కొద్దిసేపటికి దాదాపు 12 నుండి 12:30 మధ్యలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు దగ్గరికి గుర్తు తెలియని ఒక మహిళ ముసుగు ధరించి వచ్చి చెరుకు వినోద మెడలో ఉన్న మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.