రూ.1.50 లక్షలతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పీపీ.
పెద్దపల్లి: అగ్నిధారన్యూస్ రెండు సొంత అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల కుటుంబాల మధ్య జరిగిన ఇంటి గోడ నిర్మాణం విషయం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయతీలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. సమస్య పరిష్కారం కాకపోను జమ్మికుంట వైకుంఠం వ్యక్తి చావుకు కారణం అయింది. 2023నలుగురిపై కేసు నమోదు అయింది. ఆ కేసు నేడు విచారణ దశలో ఉంది. ఆ వ్యవహారమే ఇప్పుడు, ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు 1,50,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. అగ్నిధారకు పెద్దపల్లి కాచాపూర్ గ్రామం నుండి అందిన విశ్వసనీయ సమాచారం వివరాలు ఇవి న్యాయం కోసం ప్రజలు నమ్మి ఆశ్రయించే కోర్టు గదిలోనే.. న్యాయాన్ని అమ్మేసేందుకు యత్నించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కుకోవడం పెద్దపల్లి లో సంచలనంగా మారింది. కేసులో శిక్ష పడకుండా అనుకూలంగా వ్యవహరిస్తానని చెప్పి రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఆయన.. ఏ డబ్బు కోసమైతే ఆరాటపడ్డాడో చివరకు నోట్ల కట్టలతో సహా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా తోపాటు ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత సంవత్సరనరకాలంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న డొంకెన రవీందర్ తన ఇంటి వద్ద రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తన బృందంతో వల పన్ని పట్టుకున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అభాగ్యులకు అన్యాయం జరిగిన వారికి కోర్టులో వాదనలు వినిపించాల్సిన వ్యక్తే లంచం తీసుకుంటూ పట్టుబడటంతో న్యాయవర్గాల్లో ఒక్కసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది?
2023లో జరిగిన ఇరు కుటుంబాల ఇంటి గోడ నిర్మాణం భూవివాదం ఒకరి చావుకు దారితీసింది. ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో అన్నదమ్ములు’ అక్క చెల్లెలు కుటుంబాల మధ్య తీవ్ర గొడవలు జరిగాయి పలుమార్లు పంచాయతీలు పెట్టారు. ఈ క్రమంలో జమ్మికుంట వైకుంఠం మృతి మృతి చెందగా,ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మారం పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ కేసు నుండి నిందితులుగా ఉన్న వారిని కాపాడేందుకు పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ ముందుకు వచ్చినట్లు సమాచారం. నిందితులకు అనుకూలంగా వ్యవహరించి, కోర్టులో వారికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తానని చెప్పి ఏకంగా రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు జరిగిన సంఘటన ఆధారాలను బట్టి పరిశీలిస్తే తెలుస్తుంది.
రూ.2 లక్షల డిమాండ్…
రూ.2 లక్షలు అడిగిన రవీందర్.. ఒప్పందం ప్రకారం బుధవారం రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా ముందే సమాచారం అందుకున్న కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రవీందర్ ను తన నివాసంలో పక్క ప్రణాళికతో పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పెద్దపల్లి నుండి కరీంనగర్ కు తరలింపు
పట్టుబడిన రవీందర్ ను ఏసీబీ అధికారులు పెద్దపల్లి నుండి కరీంనగర్ కు తరలించారు. అక్కడ ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించినట్లు సమాచారం. లంచం ఎవరి ద్వారా, ఎలా తీసుకున్నాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
చిక్కు ప్రశ్న.. అసలు మర్మం ఏంటి?
పెద్దపల్లి జిల్లాలో జరిగిన హఠాత్పరిణామం ఏసీబీ దాడులతో జిల్లా కేంద్రంలో ఒక్కసారి హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఇక్కడే అందరినీ తొలిచే చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. ఈ కేసులో బాధితులు మొదట రూ.2 లక్షల లంచానికి ఒప్పుకొని, ఒప్పందం ప్రకారం మొదటి విడతగా రూ.1,50,000 ఇవ్వడానికి అంగీకరించారు. మరి అలా ఒప్పుకున్న వారు చివరకు ఎందుకు ఏసీబీ అధికారులకు రవీందర్ ను అప్పగించాల్సి వచ్చింది. ఒకవేళ నిజంగానే లంచం ఇచ్చి పని చేయించుకోవాలనుకుంటే ఏసీబీ అధికారుల దగ్గరకు ఎందుకు బాధితులు వెళ్లాల్సి వచ్చింది? లేక మొదట బాధితులు ఒప్పుకున్నట్టు నటించి, తర్వాత మనసు మార్చుకుని ఏసీబీని ఆశ్రయించి ఉంటారా? లేక లంచం మొత్తం ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇరువురి మధ్య మళ్లీ బేరసారాలు జరిగి విభేదాలు వచ్చాయా? లేక దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనేది ఇప్పుడు అనుమానస్పదంగా ఉంది. ఇందులో ఉన్న అసలు మర్మం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఈ కేసులోని నిజా నిజాలు బయటకు వస్తుందని స్థానికులు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏసీబీ విచారణలో ఈ కోణం కూడా బయటకు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
న్యాయవ్యవస్థలో కలకలం
న్యాయమానీవెక్కడ… అన్యాయమా నీవిక్కడ…. ప్రభుత్వం తరఫున బాధిత ప్రజలకు న్యాయం జరిగేలా వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థాయి వ్యక్తి లంచం తీసుకుంటూ పట్టుబడటం ఇప్పుడు పెద్దపల్లితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. పెద్ద చర్చకు దారితీసింది. డబ్బులు తీసుకోవడం అంటే, నిందితులకు అనుకూలంగా వ్యవహరించడం, అంటే బాధితులకు అన్యాయం చేయడమే కదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తాయని ప్రజలతోపాటు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంతకు ముందు కూడా ఇలాంటి వ్యవహారాలకు ఏమైనా పాల్పడ్డారా? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రవీందర్ కు సంబంధించిన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారo.ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రవీందర్ ను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.
అగ్నిధార ప్రతినిధి చేగొండ రవికుమార్ యాదవ్ పెద్దపల్లి జిల్లా.
