పెద్దపల్లి( అగ్నిధార ) ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే బాలల దినోత్సవం వారం రోజుల ముందే దేశవ్యాప్తంగా నవంబర్ 14 న బాలల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రభుత్వ పాఠశాలలో శనివారం సెలవు దినం కావడంతో, ఒకరోజు ముందు శుక్రవారం జరుపుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలు మాత్రం రెండవ శనివారం సెలవు దినం అయినప్పటికీ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. పిల్లలను అమితంగా ప్రేమించే,ఎంతో ఇష్టపడే భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
నవంబర్ 20 బాలల దినోత్సవం… కానీ14 నే ఎందుకు జరుపుకుంటాం?
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే బాలల దినోత్సవం వేడుక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రకారం ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20 వ తేదీన జరుపుకోవాలి. భారతదేశంలో కూడా నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు నవంబర్ 14 న బాలల దినోత్సవ వేడుక జరుపుకుంటాం. కారణం ఏంటంటే – ముందుగా చెప్పుకున్నట్టు చాచా నెహ్రూకు పిల్లలు అంటే అమితమైన ప్రేమ,అతనంటే పిల్లలకు చాలా ఇష్టం. ఆయనను పిల్లలు ముద్దుగా “చాచా నెహ్రూ” అని పిలిచేవారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని చాచా నెహ్రూ గట్టిగా నమ్మేవారు, 1964 లో మరణించాక – జవహర్ లాల్ నెహ్రూ( జయంతి ) నవంబర్ 14 పుట్టిన రోజును బాలల దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆనాటి నుండి దేశవ్యాప్తంగా నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము.
2026 లో బాలల దినోత్సవం ప్రత్యేకత ఏంటి?
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా థీమ్ – *“ప్రతి బిడ్డకు – భవిష్యత్తుకు – హక్కు”*. అంటే – కేవలం వేడుకలు మాత్రమే కాదు – ప్రతి పిల్లాడికి – చదువు, ఆరోగ్యం, భద్రత – అందాలని – ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.
నిపుణులు చెబుతున్న 3 ముఖ్య విషయాలు:
1. చదువు మాత్రమే కాదు – నైపుణ్యం: దేశంలో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు పుస్తకాలతో పాటు కంప్యూటర్, డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. రేపటి తరం ఉద్యోగాలు తోపాటు సమాజం మొత్తం శాస్త్ర సాంకేతికత పైనే మీదనే ఆధారపడి ముందుకు సాగుతుంది. అదేవిధంగా విద్యతోపాటు సమాజ సేవకులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పైన ఉంది.
మొబైల్ కు -దూరంగా
ప్రపంచవ్యాప్తంగా చేసిన ఒకసారి సర్వే లో నేటి తరం పిల్లలు – రోజుకు దాదాపు 5 గంటల పాటు మొబైల్ చూస్తున్నారని సర్వే చెబుతోంది. అందుకని నేటితరం పిల్లలు యువత కనీసం రోజులో ఒకటి రెండు గంటలు ఆటలకు కేటాయించాలని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఆటలు దోహదపడతాయని శారీరక మానసిక ఆనందానికి ఆటలు ఎంతో తోడ్పడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఆదిశగా పిల్లలు అడుగులు వేయాలి క్రీడలను ప్రోత్సహించాలి.
పిల్లల హక్కు – ప్రశ్నించే హక్కు
భారతదేశ భవిష్యత్తు మొత్తం భవిష్యత్తరం పిల్లలపైనే ఆధారపడిఉంది. నేటి బాలురే రేపటి పౌరులు అనే నినాదం అందరికీ తెలిసిందే. అది సార్ధకత కావాలంటే వారిలో ప్రశ్నించే తత్వం, విజ్ఞానాన్ని పెంపొందించుకుని సామర్థ్యాన్ని, అలవర్చాలి వారికి అందించాలి. ప్రశ్నించడం ద్వారా పిల్లల్లో విజ్ఞాన విషయపరిజ్ఞానం పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది.
పిల్లలకు శుభాకాంక్షలు
దేశ ప్రధాని తోపాటు, రాష్ట్రపతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మన దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ చెప్పిన ఒక మాటతో ఈ వార్తను ముగిద్దాం – *“పిల్లలు తోటలోనీ మొగ్గల లాంటి వారు – వారిని జాగ్రత్తగా చూసుకోవాలి”*.
