పిడుగుపాటుకు గొర్రెల మృతి …
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు….
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:
పెద్దపల్లి మండలంలోని మూలసాల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 24 గొర్రెలు మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల మృతి చెందిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ..
మూలసాల గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌లకు చెందిన గొర్రెలను గ్రామ సమీపంలోని అన్నయ్యకుంట చెరువు మేపుతుండగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో మందలోని 24 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని ఈ సంఘటన బాధాకరమని అన్నారు. అకాల వర్షంతో సంభవించిన ఈ ఘటనతో గొర్రెల కాపరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని తమ కళ్ల ముందే గొర్రెలు మృత్యువాత పడటంతో సదయ్య, నరేష్ కన్నీరుమున్నీరుగా విలపించడం బాధాకరమన్నారు. గొర్రెల పెంపకమే తమ జీవనాధారమని, ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో నష్టపోయారని వారికి ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని తెలిపారు. సంఘటన స్థలం నుండే జిల్లా కలెక్టర్ కి ఫోన్ కాల్ ద్వారా ప్రభుత్వ విప్ మాట్లాడారు. మృతి చెందిన గొర్రెలను నమోదు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ చెరుకు సుధాకర్ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, నూగిళ్ళ మల్లయ్య సింగిల్ విండో చైర్మన్ నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

