✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా దేవునిపల్లి జాతర కి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -భక్తులు జాగ్రత్తలు పాటించాలి: పెద్దపల్లిACP సారంగపాణి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు . రేపటి జాతర కొరకు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పరిశీలించారు.ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ….రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవునిపల్లి జాతర దృష్ట్యా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర సందర్బంగా ఏసీపీ -01 సీఐ లు -08, ఎస్ ఐ లు 15, ఏఎస్ ఐ /హెడ్ కాన్స్టేబుల్ లు , కాన్స్టేబుల్ లు , మహిళ సిబ్బంది, హోం గార్డ్స్ మొత్తం 140 స్పెషల్ పార్టీ సిబ్బంది తో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జాతర ప్రాంగణంతో పాటు గుట్టపై సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామని, జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామన్నారు.మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్ ను, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపినారు.భక్తులు జాగ్రత్తలు పాటించాలి అన్నారు . జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా ఉంటూ. స్వీయ రక్షణ పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకొని కోవిడ్ నియమాలు పాటిస్తూ. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు.క్యూ లైన్స్ పాటించాలి, బారికేడ్స్ దాటుకొని రావొద్దని సూచించారు.భక్తుల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అందుగుల పల్లి నుండి వచ్చిన వాహనాలు తిరిగి అదే దారిన వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .దేవునిపల్లి నుండి రంగాపురం రాఘవపూర్ మీదుగా పెద్దపల్లి కి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.టూ విలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాల పై వచ్చే వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ కోసం వేరు వేరు గా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, అట్టి ప్రదేశ్లలో మాత్రమే పార్కింగ్ చేయాలి. 7 పార్కింగ్ ప్లేస్ లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.VIP పార్కింగ్ గుట్ట సమీపంలో ఏర్పాటు చేశారు.వాహనాలను ఎట్టి పరిస్థితి లో గుడి వద్దకు అనుమతించబడవు అన్నారు .రోడ్ పైన వాహనాలను పెడితే అట్టి వాహనమును టోయింగ్ వాహనం తో పోలీస్ స్టేషన్ తరలించి సీజ్ చేస్తామన్నారు. వాహనములను నడిపే వ్యక్తి మధ్యం సేవించి నడిపితే అట్టి వాహనమును సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేస్తామన్నారు.నడవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి,వృద్దులకు, వికలాంగుల కోసం గుడి వద్దకు వెళ్లడం కోసం ఆటో లకు పాస్ లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..రెండు పోలీస్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.అత్యవసర సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తుంచవద్దు, గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి లో ఈ అధికారులకి ఫోన్ చేయవచ్చన్నారు
పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి 9400795166, సీఐ పెద్దపల్లి ప్రదీప్ కుమార్ 9440795177, ఎస్ఐ బసంత్ నగర్ మహేందర్ 9440795174 . పోలీసులు 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటారు .
