✍️✍️:వోల్లాల జలంధర్ గౌడ్. :
అగ్నిధార న్యూస్,కరీంనగర్:
సీనియర్ తెలంగాణ రాష్ట్రం సమితి సీనియర్ నాయకుడు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. టి ఆర్ ఎస్ నాయకుడు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కి రాజీనామా చెయ్యడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఈరోజు సాయంత్రం అయినా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు .తన లేఖ ద్వారా పార్టీకి రాజీనామా సమర్పిస్తూ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ తన లేఖ ద్వారా సూటిగా ప్రశ్నించారు ఆరోజు ..తెలంగాణ ఉద్యమం బలోపేతం చెయ్యడానికి కరీంనగర్ జిల్లాలో బిజెపి పటిష్టంగా ఉండి నాకు బిజెపిలో సమున్నత స్థానం ఉన్నప్పటికీ బిజెపి పార్టీ ని వదిలి మీ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరడం నిజం కాదా, టిఆర్ఎస్ …పార్టీ లో చేరి చిత్త శుద్ధి తో తెలంగాణ రాష్ట్ర సమితి అభివృద్ధి కోసం పార్టీ కోసం నేను పని నిజం కాదా… ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు గా చాలా సందర్భంలో ఏం.ఎల్. సి గా అవకాశం ఇస్త మని వాగ్దానం చేసిన మాట నిజం కాదా. నాకు అవకాశం ఇవ్వక వేరే వాళ్లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.. ఐన పార్టీ నిర్ణయానికి కట్టుబడి మీ మీద ఉన్న గౌరవం తో ఎదురు చూశాను మరోమారు.మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి…ఇవ్వలేదు..ఇలా చాలా సార్లు జిల్లా ప్రజాప్రతినిధుల సాక్షి గా మాట ఇచ్చి.. మీరే నేటికీ మీమాటలు నిలబెట్టుకొలేకపోయారు..కనీసం మీరు ఇచ్చిన మాటలు మీకు గుర్తు చేసి ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అడుగుదామని మీ సమయం కోరితే కూడా మీరు సమయం ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమ పార్టీ లో తెలంగాణ ద్రోహులను చేర్చుకొని నిజమైన తెలంగాణ వాదులకు అన్యాయం జరుగుతుంది అనడం నిజం కాదా అందుకే టీ ఆర్ స్ పార్టీ కి రాజీనామా చేయడం కొంచెం బాధగా ఉన్నప్పటికీ పార్టీలో ఇమడలేక అవకాశాలు రాక రాజీనామా చేస్తున్నాను అన్నారు .
