నెంబరు ప్లేట్లులేని వాహనాలపై, నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై,పెండింగ్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్, మాస్క్ అవగాహన కార్యక్రమం నిర్వహణ దృశ్యం . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం ట్రాఫిక్ ఏసీపి బాలరాజు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,ఈరోజు పెద్దపల్లి పట్టణం లో మస్జీద్ చౌక్ , కమాన్ చౌక్ ,. బస్టాండ్ ఏరియా , కూనరం రోడ్ ప్రదేశాలలో ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది. నెంబర్ ప్లేటు లేని వాహనాలపై,నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి సంబంధిత వాహనదారులకు, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, కేసులు, వితౌట్ నెంబర్, నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై, మరియు మైనర్ డ్రైవింగ్ పై కేసులు నమోదు చేశారు. చాలన్ పెండింగ్ ఉన్న వాహనాలను గుర్తించి జరిమానా కట్టించడం జరిగింది. 02 రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు,20నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ 184 వెహికల్స్ పై ఉన్న 703 చల్లాన్స్ Rs.2,17,000/- జరిమానా లు వాహనదారులు చెల్లించారు . ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఏసిపి బాలరాజు మాట్లాడుతూ… ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు నెంబర్ ప్లేట్ వాహనాలకు బిగించుకోవాలి, తరచుగా నెంబరు ప్లేట్ లేని వాహనాల చోదకులు వేగంగా నడుపుతూ తోటి వాహదారులను, పాదాచారులను, భయబ్రాంతులకు గురిచేస్తున్నందున నంబరు ప్లేట్లులేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు, మరియు మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనదారులు అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడుపుతునందున్న ప్రమాదం జరిగే అవకాశం ఉందని, నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ ,మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించ వద్దని, వాహనం నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని , రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మోటార్ సైకిల్ వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని, హెల్మెట్ మా శాసనం కాదు మీ సంక్షేమం, హెల్మెట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం, రోడ్ చిన్నదైనా పెద్దదైన, పడితే ప్రమాదమే ఆదమరిస్తే విషాదమైన ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నవారైన పెద్దవారైనా ప్రమాదం పొంచి ఉన్నదని ఎవరికెరుక అందుకే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రజలందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. నెంబర్ సరిగ్గా లేని వాహనాల పై కొంతమంది నేరస్తులు బండ్లపైన వచ్చి దొంగతనాలు చేయడం, చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తరచుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో , రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మంచిర్యాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది, స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు.
