పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు జర్నలిస్టులు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్‌కార్డులు అందేలా కృషి చేసారని తెలిపారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ,నిండు నూరేళ్లు కలకాలం సుఖ శాంతులతో జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అకాక్షించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కీర్తి రమేష్,కత్తెర్ల తిరుపతి యాదవ్,శిలారపు కిషన్ యాదవ్,దొమ్మేట రాజేష్,తొట్ల తిరుపతి యాదవ్, డి.లక్ష్మణ్, తిర్రి శంకర్ గౌడ్,సుధాకర్ గౌడ్,కల్లెపల్లి ప్రవీణ్, కళ్యాణ్,సంపత్ యాదవ్,వెంకటేష్,మోహన్,ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
