పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ఆధ్వర్యంలో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ లయన్ అబ్దుల్ వాసే వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు అన్నారు. ఆపరేషన్లు అవసరమైన వారిని డిసెంబర్ 31శుక్రవారం రోజున రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ లయన్ చిదుర సురేష్ సహకారం తో ఉచిత రవాణా భోజన వసతులతో శస్త్రచికిత్సలునిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్ మాట్లాడుతూ.. ప్రతి గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో నేత్రవైద్య సహాయకులు లయన్ భూతగడ్డ చందు పాల్గొన్నారు.
