అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా అగ్నిధార ఊహించిందే జరిగింది.బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ,జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు ఎల్ రమణ హాజరైన విషయం విధితమే ఈ సందర్భంగా ప్రోటోకాల్ సక్రమంగా పాటించని విషయంలో   జెడ్పి చైర్ పర్సన్ పుట్టమధుకర్ వెళ్లిపోయారని  అనుమానం వచ్చి అగ్నిధార పత్రికలో ప్రచురించింది. అగ్నిధార పత్రికా చెప్పిందే  నిజమైంది. విషయానికి బలం చేకూర్చే విధంగా  ప్రారంభోత్సవంలో శిలాఫలకం పైన మంత్రి కొప్పుల ఈశ్వర్  పేరును ప్రోటోకాల్ ప్రకారం పొందుపరచ లేదని గురువారం రోజు జిల్లా  కలెక్టర్ సంగీత సత్యనారాయణ కి పెద్దపల్లి జెడ్పి చైర్ పర్సన్ పుట్టమధుకర్ చేసిన ఫిర్యాదులో ప్రోటోకాల్ విస్మరించిన సంబంధిత వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు.