అగ్నిధారన్యూస్( పెద్దపల్లిటౌన్ )గురువారం రోజు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు మోటం రవీందర్ కోలా అనిల్ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అక్రమ వెంచర్ల పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మోటం రవీందర్ మాట్లాడుతూ….పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మున్సిపల్ పరిధిలో పలు అక్రమ వెంచర్లు వెలిశాయి అన్నారు రు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు అన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మున్సిపల్ పరిధిలోని అన్ని అక్రమ వెంచర్లు పై కొరడా ఝుళిపించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కొలిపాక సంతోష్, క్రాంతి, ప్రశాంత్, భరత్, రాజ్ కుమార్, అనిల్, గణేష్, ఉమేష్, సంపత్, సారయ్య, గోపి, కార్తీక్, తో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

