■ ఎస్ ఐ రామకృష్ణను అభినందించిన కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు.
■ పోలీస్ అంటే మీకోసం ఎస్ఐ రామకృష్ణ.
అగ్నిధారన్యూస్ రామగుండం( కమిషనరేట్ ) శనివారంరోజు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామ శివారులో గల వాగు రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ఉధృతిగా పారడంతో తన తల్లి గారి ఇంటికి వెళ్లిన వెన్నంపల్లి సునీత అనే మహిళ తిరిగి ఇందారం గ్రామంకు వచ్చే క్రమంలో ఆటో డ్రైవరు వాగు లో నీటి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో అక్కడే దింపి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న మహిళ వెంటనే 100 నెంబర్ కి ఫోన్ చేయగా. సమాచారం అందుకున్న జైపూర్ ఎస్ఐ రామకృష్ణ వెంటనే స్పందించి తన సిబ్బందితో హుటాహుటిన తన పోలీసు వాహనంలో టేకుమట్ల వాగు దగ్గరికి చేరుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను తన వాహనంలో ఎక్కించుకొని ఇందారంలోని తన ఇంటికి తీసుకెళ్లారు. దీన్ని గమనించిన సునీత కుటుంబ సభ్యులు సంబరమాశ్చర్యాలకు లోనయ్యారు. జైపూర్ ఎస్ఐ రామకృష్ణని , పోలీస్ సిబ్బంది చూపిన ప్రత్యేక చొరువుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక గ్రామ ప్రజలు జైపూర్ పోలీసుల ఔదార్యాన్ని కష్టకాలంలో చేసిన సహాయానికి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ….. కష్టకాలంలో ఎవరున్నా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించడంలో మీకోసం మేమున్నామంటూ ముందుండేవారు పోలీసులే అని తెలిపారు.

