■ ప్రజలుధైర్యంగా అప్రమత్తంగాఉండాలి.
■అధికార యంత్రాంగం అందుబాటులోనే ఉంది.
■ అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ 7995070702 నీ సంప్రదించండి.
■ పెద్దపల్లి జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
■ విపత్కర పరిస్థితులలో యువత ముందుకు రావాలి జిల్లా కలెక్టర్ సంగీత.
★ పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి, రాజీవ్ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ , అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు ఐదు రోజుల నుండి పెద్దపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడి, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందన్నారు. అయినా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని మరో ఒకటి రెండు రోజులపాటు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలెవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైన ఎదుర్కోవడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 7995070702 నీ సంప్రదించవచ్చని సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి ఎసిపి సారంగపాణి తో కలిసి మాట్లాడుతూ… భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా మున్సిపల్ అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రజలెవరు ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని వరదలకు నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, ఉపేందర్, మహేందర్, తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

