■ ఓదెల మండలంలో కలెక్టర్ పర్యటన.
■ మన ఊరు మనబడి పనుల పరిశీలన.
■ ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ.
■ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన A E సస్పెండ్
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )ఓదెల మండలంలో పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జె.సమ్మి రెడ్డిని మంగళవారం సస్పెండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.మన ఊరు మనబడి కార్యక్రమం పనులు అమలు, పరిశీలనలో ,భాగంగా జిల్లా కలెక్టర్ ఓదెల మండలంలో పర్యటించారు. మండలంలో మన ఊరు మన బడి అంశంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పలుమార్లు సూచనలు చేసినప్పటికీ ఓదెల మండలంలో చేపడుతున్న పనులలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత పనుల ఎంబి రికార్డుల నమోదు, పెండింగ్ చెల్లింపులు, పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పాటు, నిర్లక్ష్యంగా ఉన్నందుకు కలెక్టర్ క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశారు.
