అగ్నిధారన్యూస్ (సంగారెడ్డి) సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోని జెడ్పీటీసీ కార్యాలయంలో అగ్నిధార నూతన సంవత్సర క్యాలెండర్ను జడ్పిటిసి మీనాక్షీ సాయికుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా  పత్రిక ఉంటూ నిత్యం ప్రజలకు నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకు పత్రికలు దోహద పడతాయి అని అన్నారు. అగ్నిధార దిన పత్రిక అతి తక్కువ సమయంలో ప్రజలకు మంచి వార్తలు అందిస్తూ ప్రజలలో ప్రాచుర్యం పొందింది అని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి రోజు  మండలం లో ప్రభుత్వం ద్వారా జరిగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిత్యం రాస్తూ ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్య క్రమంలో చిన్నచెల్మేడ ఎంపీటీసీ మంద రాజశేఖర్ బి ర్ యస్ చిన్నచెల్మేడ గ్రామ అధ్యక్షుడు మోహన్ మాజీ సర్పంచ్ నరేష్ మోహన్ మల్లేశం మండల రిపోర్టర్ పాండు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.