■ గ్రామీణ ప్రాంతాలే టార్గెట్.
■ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.
■ అందరూ తెలుసంటూ అభయం ఇస్తారు.
■ అందిన కాడికి దండుకుంటారు.
■ రిపేర్ సమయానికి ముఖం చాటు వేస్తారు.
■ రిపేర్ ల పేరుతో మోసాలు జరభద్రం.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) రాష్ట్రవ్యాప్తంగా పల్లె పట్టణం తేడా లేకుండారకరకాల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం అనేకం చూస్తున్నాము. ముఖ్యంగా గ్రామాల్లో అమాయక ప్రజల ఆసరాను క్యాష్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్న దుండగులు మన చుట్టూ ఉన్నారు. రోజుకు ఎక్కడో ఒకకాడ మోసపోతున్న వారిని చూస్తూనే ఉన్నాము. మోసగాళ్లు ఏ రూపంలో వస్తారో తెలియదు, మనలో ఒకరిగా కలిసిపోయి, ప్రజల అవసరాలను తమకు అనుకూలంగా మలుచుకొని, అప్పటికప్పుడు అవతారాలు మార్చి, మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఉదాహరణకి గ్రామాల్లో పత్తి కొంటామని, బియ్యం కొంటామని, పాత ఇనుప సమాన్ కొంటామని, తిరిగే వాళ్ళు కొందరు. చిత్తు పేపర్ల పేరుతో ఆరుబయట ఉన్న వస్తువుల్ని కాజేసేవారు మరికొందరు.గ్యాస్ స్టవ్, ప్రిజ్, బీరువాల రిపేర్లతో కొందరు. ఆన్లైన్ వస్తువుల డెలివరీ పేరుతో మరికొందరు మోసాలకు పాల్పడుతూ ఉంటే. ఈ మధ్యకాలంలో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో టీవీల రిపేర్లు చేస్తామని కొందరు ఊరూర తిరుగుతూ, టీవీకి చిన్న రిపేర్ ఉన్న, పెద్దదిగా చూపించి వేలాది రూపాయలు లాగి, టివి బోర్డు మార్చాలి, కాయలు వేయాలి, పిక్చర్ ట్యూబ్ మార్చాలి, అని వినియోగదారులను నమ్మబలికి గంటల్లో మీ టీవీని రిపేర్ చేస్తామని మా రిపేర్ షాపు పెద్దపల్లిలో ఉంది అని చెప్పి నమ్మించి, 1500 రూపాయలు మొదలుకొని అందిన కాడికి దండుకొని వెళ్లి, వినియోదారులని బురడీ కొట్టిస్తున్న సంఘటనలు మండలంలో అక్కడక్కడ వినబడుతున్నాయి. వినియోగదారులు టీవీ రిపేరర్ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తాం అనడంతో, గుడ్డిగా నమ్మి డబ్బులు ఇచ్చి గంటలు, రోజులు, వారాలు, నెలలు, ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఫోన్ చేస్తే, నేను అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న, ఇవ్వాళ రిపేర్ చేస్తా, రేపు చేస్తా అంటూ, మాయ మాటలు చెప్పి దాటవేయడం తప్ప రిపేర్ చేసేది లేదు, వినియోగదారుడు గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేయడం, స్విచాఫ్, కాబట్టి రిపేర్ ల పేరుతో గ్రామాల్లోకి వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
