అక్రమ నాటు సారా తయారీ.
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు.
చాకచక్యంతో పట్టుకొని సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ సామ్యూల్ ఆనంద్ రావు.
నిందితులకుశిక్ష విధించిన ఓదెల మండల మెజిస్ట్రేట్.
అగ్నిదారన్యూస్, సుల్తానాబాద్: గత కొద్ది నెలలుగా నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. పద్ధతిని మార్చుకో పోగా ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో పోగా స్వయంగా సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ సామ్యూల్ ఆనంద్ రావు రంగంలోకి దిగి ఇద్దరినీ అరెస్టు చేసి వారిని ఇంతకుముందు ఓదెల మండల మెజిస్ట్రేట్ యాకన్న ముందు హాజరు పరిచినప్పటికీ పద్ధతి మార్చుకో పోవడంతో నిఘా పెట్టారు. వివరాల్లోకి వెళ్తే గతంలో ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన గండికోట కనకయ్యను, బోదాసు ప్రభాకర్ లను ఓదెల తాసిల్దార్ యాకయ్య ఎదుట బైండోవర్ చేశారు. ఎక్సైజ్ పోలీసుల దాడితో వీరిద్దరూ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ సామ్యూల్ ఆనందరావు మాట్లాడుతూ.. గ్రామాల్లో నాటుసార తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.బైండోవర్ చేసినప్పటికీ వీరిద్దరూపద్ధతి మార్చుకోకపోవడంతో ఓదెల తహశిల్దార్ యాకయ్య జైలు శిక్ష విధించారు కరీంనగర్ పంపించామన్నారు. నాటు సారా తయారు చేసే వారి పట్ల ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారులు అధికారుల ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో మరిన్ని మెరుపు దాడులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై శిరీష రెడ్డి, కానిస్టేబుల్స్ మనోహర్, సంపత్ పాల్గొన్నారు.

