అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రంగంపల్లి వద్ద గల రుచి గ్రాండ్ హోటల్లో ఈరోజు తెల్లవారుజామున…? దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పైన హత్యయత్నం జరిగింది. ఈ సంఘటనతొ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రేమ్ కుమార్ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడిగా తెలుస్తుంది…. 108కి ఘటన సంబంధించిన సమాచారం అందడంతో.. సంఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితుని పోలీసుల సహకారంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

