రాఘవాపూర్ సర్పంచిని పదవి నుండి తొలగించాలి.

ముగ్గురు పిల్లలు ఉన్న అర్హుడు ఎలా…?

పంచాయతీరాజ్ చట్టం 2018 అమలు చేయాలి.

విచారణ పేరుతో కాలయాపన.

సర్పంచ్ కు సహకరిస్తున్నారని.

ఫిర్యాదుదారు ఆరోపణ.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి కలెక్టరేట్ )

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ సర్పంచ్ ఆడపు వెంకటేశం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కి విరుద్ధంగా, ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారని, గత ఎన్నికల్లో పోటీ చేసి రాఘవాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొంది పరిపాలన ఎలా చేస్తున్నారని, సర్పంచ్ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని, కోరుతూ.. తేదీ14.6.2023 రోజున అదే గ్రామానికి చెందిన తాడిశెట్టి శ్రీకాంత్  . బూర్ల వంశీ కుమారస్వామి మల్లయ్య మరికొందరు, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు.జిల్లా పంచాయతీ అధికారి 26.06.2023 ఆదేశాల మేరకు పెద్దపల్లి మండల పంచాయతీ అధికారి సుదర్శన్, రాఘవపురం గ్రామపంచాయతీలో విచారణ చేపట్టడానికి తేదీ:31.07.2023… తేదీ:05.08.2023 తేదీ:26.08.2023 తేదీలలో విచారణకు హాజరుకావాలని సమాచారం అందించిన,సర్పంచ్  విచారణకు హాజరు కాలేదని, తదుపరి విచారణ 3.10.2023 రోజున నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. గ్రామపంచాయతీ యందు విచారణ నిర్వహించారు. ఆవిచారణలో ఇరు వర్గాల నుండి,మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకొని, ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదు వాస్తవమేనని, ఆడెపు వెంకటేశం సర్పంచ్ గా ఎన్నిక కాకముందు ఇద్దరు కుమార్తెలు కలిగి ఉన్నారని, సర్పంచ్ ఎన్నిక అనంతరం 10.10.2020 రోజున కుమారుడు జన్మించాడని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21 ( 3 ) ప్రకారం తేదీ:31.05.1995 తర్వాత ముగ్గురు సంతానం కలిగి ఉండరాదని, ఈ నిబంధన  ఎన్నికలకు అనర్హులని గ్రామపంచాయతీ సభ్యులుగా కూడా కొనసాగుటకు అర్హత లేదని పేర్కొనబడినదని, ఎంపీఓ సుదర్శన్, జిల్లా పంచాయతీ అధికారికి తన నివేదికలో తెలిపారు.

సర్పంచ్ పై అనర్హత వేటు తప్పదా…?

రాఘవపూర్ సర్పంచ్ ఆడపు వెంకటేశంపై అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ మరికొందరు చేసిన ఫిర్యాదుకు విచారణ చేపట్టిన అధికారులు నివేదిక జిల్లా కలెక్టర్ సమర్పించినట్లు విశ్వాసనీయ సమాచారం.  నివేదికల ఆధారంగా సర్పంచ్ వెంకటేశం ని అనర్హుడిగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దానికి సంబంధించిన ప్రతిని సర్పంచుకు పంపించినట్లు తెలుస్తుంది.