మతసామరస్యానికి నిదర్శనం మన దేశం.
సర్వమత సమ్మేళనం తెలంగాణ.
అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలి.
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
గురువారంరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, ముస్లింల ఆరాధ్య పర్వదినమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులను ఆప్యాయంగా అలైబలై తీసుకుంటూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి పెద్దపల్లి నియోజకవర్గంలో పాటు, తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదర భావం ఐక్యతను పెంపొదిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, సయ్యద్ మస్రత్, గౌస్ పట్టణ కౌన్సిలర్స్, మైనారిటీ మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










