ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంతోష్
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన సంతోష్ అనే బెల్ట్ షాప్ దుకాణదారుడు, సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తుంది… పెరకపల్లి గ్రామానికి చెందిన సంతోష్, మియాపూర్ లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు…. సుల్తానాబాద్ మండలంలో సిండికేట్ గా ఏర్పడ్డ మద్యం దుకాణదారులు.. బెల్ట్ షాప్ లకి అధిక ధరలకు మద్యం విక్రయించడం వల్ల తన బెల్ట్ షాపులో మద్యాన్ని అధిక రేటుకు అమ్మవాల్సి వస్తుందని సంతోష్ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అది గమనించిన సిండికేట్ నిర్వహకులు స్టేటస్ లో ఆ విధంగా ఎందుకు పెట్టావ్ అంటూ, మానసికంగా వేధించారంటూ సోమవారం రోజు రాత్రి థమ్స్ అప్ లో ఎలకల మందు కలుపుకొని తాగుతున్నానని తన ఆత్మహత్యాయత్నానికి వాళ్లే కారణమంటూ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.సిండికేట్ వ్యాపారస్తులకి అధికారులు అండదండలు ఉన్నాయని ఆ వీడియోలు తెలిపారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వీడియో వాట్సాప్ గ్రూపులలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదే విషయమై సుల్తానాబాద్ ఎస్ ఐ ని వివరణ కోరగా ఇంతవరకు ఈ విషయంపై ఫిర్యాదు అందలేదని తెలిపారు.
