అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించి పూలమాలతో సత్కారం…
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ విజ్ఞాన్ భవన్ డిల్లీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో, పెద్దపల్లి మండలానికి చెందినటి.టీ సంపత్ కుమార్,జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడిన సందర్భంగా, కలెక్టర్ చాంబర్లో, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పి ఎం షేక్,జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు,డి.సి.ఇ.బి సహాయ కార్యదర్శి ఎం.నరేష్, చేగొండ రాజ్ కుమార్ లు పాల్గొని అవార్డు పొందిన ఉపాధ్యాయున్ని అభినందించారు.
