ఇరు వర్గాల ఘర్షణ

పంచాయతీ పేరుతో కత్తిపోట్లు ఇద్దరు దుర్మరణం..?

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు.

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్  

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లె గ్రామంలో భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా వివాదం  ఏర్పడడంతో పెద్దమనుషుల సమక్షంలో ఈరోజు పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ఇరుపక్షాల మధ్య మాట  మాట పెరగడంతో ఆగ్రహానికి లోనవడంతో మల్లేష్, గణేష్ లకు కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావం కావడంతో  ఇరువురిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ పంచాయతీకి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.