అగ్నిధార న్యూస్,పెద్దపల్లి :

పెద్దపల్లి మండలం లోని రాంపల్లి హనుమంతుని పేట ముత్తారం గౌరీరెడ్డిపేట్ రాఘవపురం రంగాపూర్ సబ్బితం దేవునిపల్లి గుర్రంపల్లి తురకల మద్దిగుంట బొంపల్లి కాసులపల్లి పాలితం అటవీ భూములు ఉన్నచోట కమిటీలు వేసి భూముల  వివరాలు సేకరణ చేపట్టారు ఇందులో భాగంగా ఈరోజు మండలంలో ఫారెస్ట్ భూములు అటవీ పోడు భూముల సాగు చేస్తున్నటువంటి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది .గుర్రంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాదిరెడ్డి  భాగ్యలక్ష్మి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి పోడు భూముల సేకరణ సమావేశంలో లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ వీఆర్ఏ నరేష్ ఓదెలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.