అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా:
జిల్లాలోనే వైన్ షాప్ లను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. శనివారం బందంపల్లి లోని స్వరూప గార్డెన్స్ లో వైన్ షాప్ కేటాయింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలోనే 77 వైన్ షాప్ లలో 13 గౌడ కులస్తులకు, 8 ఎస్సీ కులస్తులకు రిజర్వేషన్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 77 వైన్ షాపులకు 1054 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో లాటరీ పద్ధతి ద్వారా వైన్ షాప్ లను పారదర్శకంగా కేటాయించడం కలెక్టర్ తెలిపారు. వైన్ షాప్ లో కేటాయించే ప్రక్రియను నిబంధనల మేరకు వీడియో గ్రఫీ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా అబ్కారీ శాఖ సూపరిండెంట్ రవి కుమార్, డిసిపి రవీందర్ ,సి.ఐ.లు శ్రీనివాస్, రాథోడ్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
