ఎన్జీవోల సంఘం   హోలీ వేడుకలలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.

అగ్నిధారన్యూస్(   పెద్దపల్లి ):శుక్రవారం.  హొలీ పండగ సందర్భంగా  పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో… పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్  లక్ష్మి నారాయణ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ ను, వారి వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి వారితో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ….. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకి, హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈహోలీ పండగ వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని ,ఐకమత్యాన్ని ,పెంపొందించడానికి సంతోషాన్ని, నింపడానికి ఇలాంటి వేడుకలు దోహదపడతాయి అన్నారు.

డిసిపి రవీందర్,  మాట్లాడుతూ పండుగ ప్రజల  అందరి జీవితాలలో వెలుగు నింపాలని అన్నారు.  రసాయనాలు వాడని రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవోల సంఘం రూరల్ అధ్యక్షుడు సురేష్ అర్బన్ అధ్యక్షులు సందీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి తిరుపతి రెడ్డి ప్రేమ్ కుమార్ మధు తదితరులు పాల్గొన్నారు.