సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి బాధితుడికి 3 తులాల బంగారు గాజుల అప్పగించిన పెద్దపల్లి పోలీసులు

అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) ఆదివారం రోజు 8 ఇంక్లైన్ కాలనీ నుండి పెద్దపల్లి కి డెకరేషన్ సామాన్ తీసుకొని వస్తున్న  ఆటో నెంబర్ TS 02 UT 7147 లో జూలపల్లి గ్రామం వద్ద బొజ్జ పురుషోత్తం, గోల్డ్ స్మిత్, గోదావరిఖని అనే వ్యక్తి పెద్దపల్లి వచ్చుటకు ఆటో లో ఎక్కడం జరిగింది. పెద్దపల్లి కి వచ్చాక దిగి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత  తన వద్ద ఉన్న బంగారు గాజుల  చిన్న సంచి కనపడకపోయేసరికి  కంగారు పడి పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలో ఆటో గురించి వెతికిన దాని వివరాలు తెలియక పోయేసరికి, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి  గాజులు ఉన్న బ్యాగు ఆటోల మిస్ అయిందని పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ వెంటనే స్పందించి ………. ఎస్ఐ-2 రాజవర్ధన్ సిబ్బంది దుబాసి రమేష్, శరత్ లకు చెప్పగా వారు బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించి సదర్ ఆటో ఒక డెకరేషన్ షాపు వద్దకు వెళ్లినదని తెలుసుకుని అక్కడికి వెళ్లి షాపు యజమాని ఆటో వివరాలు అడగగా అట్టి ఆటో డ్రైవర్ పేరు హైమద్ ఖాన్ కరీంనగర్  కి చెందినవాడని  అతని వివరాలు ఫోన్ నెంబర్ తెలపగా   ఎస్ ఐ  ఆటో డ్రైవర్ తో ఫోన్లో మాట్లాడి  ఆటోలో బంగారు గాజుల బ్యాగ్ ఉంది ఒకసారి చెక్ చేయమని తెలపగా ఆటో డ్రైవర్  నిజాయితీతో వ్యవహరించి తన ఆటోలో ఉన్నటువంటి బంగారు గాజులు బ్యాగును సోమవారం రోజు పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ కి అప్పగించడం జరిగింది. ఆటోడ్రైవర్ నిజాయితీ మెచ్చుకుని ఎస్ ఐ అభినందించారు.   బాధితున్ని పిలిపించి మూడు తులాల బంగారు గాజులు బ్యాగ్ అప్పగించడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు  తెలిపారు.