■ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ కి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, పలువురు సిఐలు ,ఎస్ఐలు.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా ఇంచార్జి డీసీపీగా అఖిల్ మహాజన్ (ఐపీఎస్) బాధ్యతలను స్వీకరించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేసిన పి. రవీందర్ చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ కి అటాచ్ గా వెళ్లగా ప్రస్తుతం రామగుండం డీసీపీ అడ్మిన్ గా పనిచేస్తున్న అఖిల్ మహాజనకు పెద్దపల్లి ఇంచార్జి డీసీపీగా అధనపు బాధ్యతలను అప్పగిస్తూ రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్(ఐజీ)ఉత్తర్వులను జారీ చేశారు. ఇంచార్జి డీసీపీగా వచ్చిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి సారంగపాణి తో పాటు పలువురు పోలీస్ అధికారులు, కలిసి శుభాకాంక్షలు తెలిపారు.