పెద్దపల్లి పార్లమెంట్ రిజల్ట్స్ లో అగ్నిధారన్యూస్…
అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్
నిజమే రాస్తాము రాసిందే నిజం అవుతుంది.. గత సంవత్సరం జరిగిన పెద్దపల్లి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు గెలుపు గురించి అగ్నిధార వార్తాపత్రికలో ప్రత్యేక కథనాన్ని శాసనసభ ఎన్నికల ముందు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని విజయం విజయరమణారావు కి సొంతమని తెలుపుతూ వచ్చాము.. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంతో పెద్దపల్లి పార్లమెంటు లోని అసెంబ్లీ నియోజకవర్గాలైన బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు ,రామగుండం, మంథని ,ధర్మపురి, పెద్దపల్లి ప్రజల నుండి ఆయా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకొని గెలుపు దిశగా గడ్డం వంశీకృష్ణ..అనే కథనాన్ని ఏప్రిల్ నెలలో ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి తగ్గట్టుగా ఆయా నియోజకవర్గాలలోని ప్రజలు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా.. గెలిపించడంతో.. అగ్ని ధార పత్రికలో వచ్చిన కథనానికి ఆయా నియోజకవర్గాల ప్రజలు దీన్ని నిజం చేశారు.
