అగ్నిధార(రామగిరి మండలం)
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని వివిధ గ్రామాల బెల్ట్ షాపుల నిర్వాహకులతో మంథని ఇన్స్పెక్టర్ రాజు రామగిరి, ఎస్ ఐ సందీప్ కుమార్ సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.ఇట్టి సమావేశంలో బెల్ట్ షాపు నిర్వాహకులకు పలు సూచనలు చేయడం జరిగింది.గ్రామాలలో కిరాణా షాపులు నిర్వహిస్తూ కిరాణా షాపు ముసుగులో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపైన చట్టవరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది.విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహించడం వలన గ్రామాలలోని యువత మద్యానికి చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలియజేయడం జరిగింది.ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని లేకపోతే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకో బడతాయని హెచ్చరించడం జరిగింది . విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహించి అక్రమంగా మద్యం అమ్మి శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిని ఎవరినైనా వదిలిపెట్టేది లేదని వారి పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు

