బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

– బెల్ షాప్ నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్

– అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు.

మంథని సీఐ రాజు.

అగ్నిధార వరుస కథనాలకు కదలిక..!

కదలని ఎక్సైజ్ యంత్రాంగం…?

అగ్నిధారన్యూస్(మంథని మండలం)

అగ్నిధార పత్రికలో గత మూడు రోజులుగా వరుస కథనాలతో,మంథని మండలంలో జోరుగా బెల్ట్ షాపుల నిర్వహణ జరుగుతుందని, మండలంలోని వివిధ గ్రామాల బెల్ట్ షాపుల నిర్వాహకులతో మంథని ఇన్స్పెక్టర్ రాజు,మంథని ఎస్ ఐ వెంకటకృష్ణ,సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ చేశారు.ఇట్టి సమావేశంలో బెల్ట్ షాపు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.గ్రామాలలో కిరాణా షాపులు నిర్వహిస్తూ, కిరాణా షాపు ముసుగులో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపైన చట్టవరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహించడం వలన గ్రామాలలోని యువత మద్యానికి చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని లేకపోతే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకో బడతాయని హెచ్చరించడం జరిగింది. విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహించి అక్రమంగా మద్యం అమ్మి శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిని ఎవరినైనా వదిలిపెట్టేది లేదని వారి పైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.