పెద్దపల్లి జిల్లాలోని 37 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానచలనం..
తక్షణమే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు.
పెద్దపల్లి, నవంబర్ 4 (అగ్నిధార న్యూస్):
పెద్దపల్లి జిల్లాలో 13మండలల, గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలు తేదీ 03.11 .2026 ఆకస్మికంగా జరిగాయి. జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 37 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఒక మండలం నుంచి మరో మండలానికి బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.పరిపాలనా కారణాల చేత ఇతర మండలాలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లిజిల్లా కలెక్టర్ (పంచాయతీ విభాగం) కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్ నంబర్ 2783/2025/A1 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆమోదంతో విడుదలైన ఈ ఆదేశాల్లో 27 మంది గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు,10 మంది మండల కంప్యూటర్ ఆపరేటర్లు పేర్లను బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మండల కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీల వివరాలు.
సతీష్ బట్టు – ధర్మారం నుంచి ఎలిగేడ్కు. (డీపీఓ కార్యాలయానికి డిప్యూటేషన్)శ్రీనివాస్ బుట్టి – కమాన్‌పూర్ నుంచి మంథనికి.సంపత్ తాళ్ల – మంథని నుంచి రామగిరికి.శాంతి శేఖర్ – ముత్తారం నుంచి అంతర్గాంకు.నాగపురి రమేష్ – అంతర్గాం నుంచి పాలకుర్తికి.అవుల ప్రశాంత్ – పెద్దపల్లి నుంచి ధర్మారానికి. గోస్కుల శ్రీనివాస్ – జూలపల్లి నుంచి పెద్దపల్లికి. (ఏసీఎల్బీ కార్యాలయానికి డిప్యూటేషన్)
రవీందర్ రాడరపు – సుల్తానాబాద్ నుంచి ఓదెలకు
కలవేన సంపత్ – శ్రీరాంపూర్ నుంచి సుల్తానాబాద్‌కు. (పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి డిప్యూటేషన్)
శ్రీకాంత్ సుంక – ఎలిగేడ్ నుంచి శ్రీరాంపూర్‌కు.

గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీ వివరాలు.
ఆరవెల్లి సరిత – ధర్మారం నుంచి జూలపల్లికి.
సుంకరి సంపత్ – శ్రీరాంపూర్ నుంచి ఓదెల.
కొండి సునీల్ – శ్రీరాంపూర్ నుంచి ఓదెలకు.
నిర్మల తుంగాని – సుల్తానాబాద్ నుంచి ధర్మారం.
గుడికందుల సురేష్ – ఎలిగేడ్ నుంచి ధర్మారానికి.
బుర్ర కుమార్ – ఎలిగేడ్ నుంచి ధర్మారానికి.
చంద్రశేఖర్ తొంటి – జూలపల్లి నుంచి పెద్దపల్లికి.
దోనపాటి తిరుపతి రెడ్డి – జూలపల్లి నుంచి సుల్తానాబాద్‌కు.మరుముల్ల సుమన్ – కమాన్‌పూర్ నుంచి మంథనికి.అద్దూరి సమ్మరాజు – మంథని నుంచి కమాన్‌పూర్‌కు. (మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి డిప్యూటేషన్)బోడ తిరుపతి – మంథని నుంచి శ్రీరాంపూర్‌కు శాతురి ప్రశాంత్ – ఓదెల నుంచి ముత్తారానికి.బోడ మధుకర్ – ముత్తారం నుంచి కమాన్‌పూర్‌కు.బుసారపు రాజు – ఓదెల నుంచి సుల్తానాబాద్‌కు.పౌడాల సతీష్ – ముత్తారం నుంచి రామగిరికి.తూడి విజయ – ఓదెల నుంచి శ్రీరాంపూర్‌కు.
బోడ వెంకటేశం – రామగిరి నుంచి మంథనికి దాది చంద్రశేఖర్ – ఓదెల నుంచి సుల్తానాబాద్‌కు.గోపగోని సతీష్ కుమార్ – శ్రీరాంపూర్ నుంచి ముత్తారం దాసరి వేణుగోపాల్ రెడ్డి – సుల్తానాబాద్ నుంచి ఎలిగేడు. బానోత్ తిరుపతి – పాలకుర్తి నుంచి పెద్దపల్లికి.దువ్వాసి వేణుసాగర్ – పాలకుర్తి నుంచి పెద్దపల్లికి.గంగాధరి గంగాధర్ – పెద్దపల్లి నుంచి అంతర్గాంకు.తిర్రి శ్రీరాం గౌడ్, పెద్దపల్లి నుంచి పాలకుర్తికి.జనగామ నూతన – రామగిరి నుంచి మంథనిషౌకత్ పాషా మహమ్మద్ – సుల్తానాబాద్ నుంచి జూలపల్లికి.తొంటి రమేష్ – ధర్మారం నుంచి ఎలిగేడ్కు.
తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు.
జిల్లాలో బదిలీ అయిన కంప్యూటర్ ఆపరేటర్లు ఆలస్యం చేయకుండా కేటాయించిన కొత్త స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే రిలీవ్ చేసి, కొత్త స్థానాల్లో విధుల్లో చేర్చుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
పరిపాలనా కారణాలతోనే బదిలీలు.
జిల్లాలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను పరిపాలనా అవసరాలకు అనుగుణంగా, విధుల నిర్వహణకు సంబంధించి ఈ స్థానచలనం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై జిల్లా వ్యాప్తంగా కంప్యూటర్ ఆపరేటర్లలో చర్చ జరుగుతోంది.
