ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాలలో మరణ ధ్రువీకరణ పత్రాలు –

ఆధారాలతో సహా బయటపడిన 5 ఏళ్ల నాటి మిస్టరీ.

అగ్నిధార దగ్గర కీలక ఆధారాలు.

ప్రభుత్వ దవాఖానాలో అడ్మిట్ అయినట్టు ఓపీ.

మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్.

గ్రామపంచాయతీ సెక్రటరీ మరొకటి జారీ చేసిన డెత్ సర్టిఫికెట్.

మృతుడు సాగర్ పేరు మీద ఉన్న భూములు మార్పు.

భూముల మార్పుల్లో లీగల్ హేర్ సర్టిఫికెట్ లేదు.

మున్సిపల్ వర్సెస్ గ్రామం పంచాయతీ.?

పెద్దపల్లి, అక్టోబర్ 31 (అగ్నిధార): పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి, అవకతవకలకు నిదర్శనంగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు ప్రభుత్వ కార్యాలయాల నుండి ఇద్దరు  రెండు మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం జిల్లాలో సంచలనంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పక్కా ఆధారాలు అగ్నిధార న్యూస్ కి లభించాయి.

2021 జూలై 26న ఏం జరిగింది?

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం భోజన్నపేట్ గ్రామానికి చెందిన కుడుదుల సాగర్ (23)  తన భార్య కుడుదుల తేజ తో కలిసి పొద్దంతా  వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం 3  గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి అందరితోటి మాట్లాడుతూనే సాగర్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటూ, అకస్మాత్తుగా కింద పడిపోయారు, తన భార్య తేజ ( ఝాన్సీ)ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆటోలో సాగర్ ను  పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది. కుటుంబ సభ్యులు వెంటరాగా హాస్పటల్ సిబ్బంది ఒపీని నమోదు ప్రథమ చికిత్స అందించారు. సాయంత్రం 5 20 కి అదే ఆస్పత్రిలో సాగర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అగ్నిధార చేతిలో ఉన్న మరో ఆధారం  హాస్పిటల్ OP టికెట్.

ఒకే వ్యక్తికి జారీ అయిన రెండు డెత్ సర్టిఫికెట్లు

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఓపి టికెట్

పెద్దపల్లి  జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి OP No. 6351 ప్రకారం, 26/07/2021న సాగర్ ను అడ్మిట్ చేసుకున్నారు.  చికిత్స చేశారు. పరిస్థితి విషమించి సాయంత్రం 5:20 PM కి మరణించినట్లు హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. దీనిని మెడికల్ అప్పటి సూపరింటెండెంట్ ధ్రువీకరించారు.అగ్నిధార వద్ద ఉన్న హాస్పిటల్ ఆధారం.

ఒకే వ్యక్తికి జారీ అయిన రెండు డెత్ సర్టిఫికెట్లు
మున్సిపల్ కమిషనర్ జారీచేసిన డెత్ సర్టిఫికెట్

మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన డెత్ సర్టిఫికెట్.

భోజన్న పేట గ్రామానికి చెందిన కుదుగుల సాగర్ మరణించాడు,అనే సమాచారం మొదట పెద్దపల్లి హాస్పిటల్ డాక్టర్లకు తెలుసు. తరువాత ఇదే విషయాన్ని మరణ ధ్రువీకరణ నమోదు  సమాచారార్థం  మున్సిపాలిటీకి సమాచారం వెళ్లింది. పెద్దపల్లి మున్సిపాలిటీ జనన మరణాల నమోదు విభాగం అధికారులు పరిశీలించి ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు ఇచ్చిన ఆధారాలతో కుడుదుల సాగర్ ప్రభుత్వ హాస్పిటల్లో మరణించాడని ధ్రువీకరించుకొని, మరణ ధ్రువీకరణ పత్రం నెంబర్  నెంబర్ 275  ద్వారా 23/09/2021న అధికారికంగా డెత్ సర్టిఫికెట్ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ జారీ చేశారు.

ఒకే వ్యక్తికి జారీ అయిన రెండు డెత్ సర్టిఫికెట్లు
పంచాయతీ అధికారి జారీ చేసిన డెత్ సర్టిఫికెట్

పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన డెత్ సర్టిఫికెట్.

  అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలయ్యింది. చనిపోయింది పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాలో అంటే పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో కాబట్టి ,మున్సిపల్ అధికారి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.  భోజన్నపేట గ్రామ పంచాయతీలో కానీ పంచాయతీ పరిధిలో కానీ చనిపోని వ్యక్తికి  మరణ ధ్రువీకరణ పత్రం  గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలా..? జారీ చేస్తారు అని బాధితురాలు ప్రశ్నిస్తుంది.   అంతుపట్టని చర్చ జరుగుతుంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఒక డెత్ సర్టిఫికెట్..  భోజన్నపేట గ్రామపంచాయతీలో మరో  డెత్ సర్టిఫికెట్ పంచాయతీ కార్యదర్శి రమేష్   *రిజిస్ట్రేషన్ నెంబర్ 02*,   తేదీ 09/08/2021. ద్వారా జారీ చేశారు. పెద్దపల్లి  మున్సిపాలిటీలో  చనిపోయిన వ్యక్తికి భోజన్న పేట గ్రామ పంచాయతీలో ఎలా సర్టిఫికెట్ ఇస్తారు ? అనేదే ఇప్పుడు ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

సర్టిఫికెట్ మారిన భూముల వివరాలు
రెవెన్యూ కార్యాలయంలో 38 రోజుల్లోనే మారిన భూములు

డెత్ సర్టిఫికెట్ల మిస్టరీతో బయటపడ్డ భూముల మార్పిడి వ్యవహారం.

పంచాయతీ కార్యదర్శి సాగర్ చనిపోయిన 15 రోజుల్లోనే ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రం    ఆధారంగా అసలు  కథ కుటుంబ సభ్యులు నడిపించారు. తన భార్య కుడుదల తేజ ( ఝాన్సీ )కి తెలియకుండా తన భర్త సాగర్ పేరు మీద ఉన్న భూములు సర్వే నెంబర్ 373/2 లో ఉన్న 1.17 ఎకరాల భూమి, *16/09/2021న*  ఈడెత్ సర్టిఫికెట్ ఆధారంగా  కుడుదుల ఇందిరా పేరు మీదకు మారిపోయింది. (సాగర్ పేరు మీద ఉన్న  మిగతా భూములతో పాటు  )దీనికి సంబంధించిన EC లో “Pattadar (Deceased)” నుండి “Successor” కి మారినట్లు స్పష్టంగా ఉంది. ఇదే మరణ ధ్రువీకరణ పత్రంతో సాగర్ పేరు మీద ఉన్న బ్యాంకు లావాదేవీలు, రైతు చనిపోతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బీమా కూడా ఈ సర్టిఫికెట్ ఆధారంగానే  లావాదేవీలు జరిగాయి.

ఐదేళ్లు గడిచిన యాక్షన్.. రీ రియాక్షన్ లేదు.

మరణ ధ్రువీకరణ పత్రాల జారీ అవకతవకలపై బాధితుడి భార్య కుటుంబ సభ్యులు 29/09/2021న జిల్లా పంచాయతీ అధికారికి లిఖిత పూర్వకంగా  ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి ఎంపిఓ సుదర్శన్ ను విచారణ అధికారిగా నియమించి తూతూ మంత్రంగా విచారణ చేపట్టారు, అనే ఆరోపణలు ఉన్నాయి. చేపట్టిన విచారణ తీసుకున్న చర్యలు నేటికీ ఫిర్యాదు దారికి ఇవ్వలేదు. రెండు డెత్ సర్టిఫికెట్ల లో ఏ ఒక్క సర్టిఫికెట్  రద్దు చేసినట్లు సమాచారం లేదు. విచారణ నివేదిక బయటకు రాలేదు, ఫిర్యాదు దారునికి తెలుపలేదు. అంటే పంచాయతీరాజ్ అధికారుల నిబద్ధత  ఇక్కడే అర్థమవుతుంది.

పెద్దపల్లిలో  రెవిన్యూ  లీలలు.

  ఈ వ్యవహారంలో పంచాయతీరాజ్ అధికారులు వ్యవసాయశాఖ అధికారుల వ్యవహారం ఈ విధంగా ఉంటే.. రెవెన్యూ  అధికారులు వ్యవహారం మరో  బిగ్ ట్విస్ట్ గా ఉంది.భర్త చనిపోతే భార్య లీగల్ హేర్ అవుతుంది. భర్త ఆస్తులపై తనకు అధికారం సంక్రమిస్తుంది.తన భర్త పేరు మీద ఉన్న భూములను సాగర్  తల్లి ఇందిరా పేరు మీద తనకు తెలియకుండానే అప్పటి తహసిల్దార్  రెవెన్యూ అధికారులు  లీగల్  హేర్ అయినా నేను,నాభర్త చనిపోయిన బాధలో నేను ఉంటే, భూములు మొత్తం 38 రోజుల్లోనే అంటే మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ రాకముందే నా ప్రమేయం లేకుండానే ఎవరి అండ దండలతో భూములు మార్చారు అంటూ ప్రశ్నించింది. అత్తగారి కుటుంబ సభ్యులు చేసిన అరాచకానికి, అధికారులు చేసిన తప్పులకి,ఇప్పటి ఐదు ఏళ్లుగా న్యాయం  జరగక   నరకయాతన అనుభవిస్తున్నానని.  అగ్నిధారతో బాధితురాలు కుడుదుల తేజ ( ఝాన్సీ ) కన్నీటి పర్యాంతమైంది.

ఒకే వ్యక్తికి రెండు డెత్ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? అధికారులే  చెప్పాలి.

ఏది నిజమైనది? ఏది అబద్ధం? మరణ ధ్రువీకరణ పత్రం జారీలో పంచాయతీ కార్యదర్శి పాత్ర ఏంటి?  మున్సిపల్ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ తప్ప..? పంచాయతీ అధికారి ఇచ్చిన సర్టిఫికెట్ తప్ప? అనే ప్రశ్నలకు  పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. తప్పుగా జారీ చేసిన సర్టిఫికెట్ రద్దుచేసి చర్యలు చేపట్టాలి.

అగ్నిధార క్షేత్రస్థాయి పరిశీలన

అగ్నిధార బృందం భోజన్నపేట్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు సాగర్ భార్య తేజ పొద్దంతా పొలం పనులకు వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చిన సాగర్ కింద పడిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి ఆటలో తరలించారు. పెద్దపల్లి హాస్పిటల్ లోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్  ఓపి రికార్డుల పరిశీలనతో వెల్లడయింది. ముఖ్యంగా   భూములు మార్పిడిలో  లీగల్ హేర్ మృతుడి భార్య  తేజ ( ఝాన్సీ ) కి విషయం తెలియదు. ఇదే విషయమై అగ్నిధార ఆర్టిఐ ద్వారా సమాచారం సేకరించింది.  భూమి మార్పిడికి సంబంధించిన పత్రాలలో లీగల్ హేర్ సర్టిఫికెట్ లేకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా, మిస్టరీగా మారింది అని చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో,తెలియాల్సి ఉంది. అధికారుల సమాధానం చెప్పాలి.

అగ్నిధార పరిశీలనలో ప్రధాన ఆరోపణలు.

భోజన్నపేట గ్రామపంచాయతీ రికార్డులలో  తేదీ:7/8/2021నాడు  నమోదు నమోదు చేసి. తేదీ:9/8/2021 రోజు  పంచాయతీ కార్యదర్శి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అంటే 15 రోజులకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయ రికార్డులలో తేదీ: 23/8/2021 రోజు నమోదు చేశారు. తేదీ:28/9/2021 జారీ చేశారు. అంటే మున్సిపల్ కమిషనర్ 60 రోజులకు మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. పెద్దపల్లిలో చనిపోయిన వ్యక్తికి 15 రోజులలో పంచాయతీ కార్యదర్శి హడావిడిగా డెత్ సర్టిఫికెట్ ఎందుకు జారీ చేశారనేది అగ్ని ధార పరిశీలనలో ప్రధానంగా ఆరోపణ వినబడుతుంది. ఇదే విషయం జిల్లా ఇన్చార్జ్ పంచాయతీ అధికారి శ్రీమాలను వివరణ కోరగా ఈ విషయం గురించి మరోసారి సమగ్రంగా విచారిస్తామన్నారు. ఒక వ్యక్తికి రెండు డెత్ సర్టిఫికెట్లు ఎలా జారీ  చేస్తారన్నారు. తప్పునీ తేలితే చర్యలు చేపడతామన్నారు.

మీ ప్రాంతంలో ఇలాంటి వ్యవహారాలు మీ దృష్టికి వచ్చినట్లయితే మా చరవాణి నెంబర్ కి 9573 563279 కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

చేగొండ రవికుమార్ యాదవ్, అగ్నిధార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా.