ప్రజాధనం ఎవరి కోసం..? ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
అగ్నిధారన్యూస్ హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు… ఈ మూడు అబద్ధాలు చెప్పి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాకా వెంకటస్వామి అంబేడ్కర్ పేరుతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ, ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల వంటి వెనుకబడిన ప్రాంతాల రైతులకు నీటి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు.కేసీఆర్ ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేసి, 2016లో భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా అంతర్జాతీయ వేదికలపై గొప్పగా చెప్పుకున్నారనీ ఆయన విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని ఎందుకు చెప్పడం లేదని కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు..?కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పైపుల ద్వారా నీటిని తరలించారంటూ ఆరోపిస్తూ, సుమారు రూ.100 కోట్లతో 10 కోట్ల లీటర్ల నీటితో KCR చెరువును ఏర్పాటు చేసుకున్నారని ఎంపీ విమర్శించారు. ప్రజాధనం వినియోగంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.1969 తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు లాఠీ దెబ్బలు, తుపాకీ తూటాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని, కల్వకుంట్ల కుటుంబం చేసిన అరాచకాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.
