ఢిల్లీలో నేడు జరుగుతున్నది నగర దిగ్బంధం కాదు, యావత్ దేశ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం.

కేంద్రం దిగి రాకుంటే ప్రజా దండయాత్ర తప్పదు.

కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకుడు కందుల అశోక్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిరంకుశ, నియంతృత్వం పరిపాలన నడుపుతున్న బిజెపి ప్రభుత్వం సీఈసీని అడ్డుపెట్టుకొని దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల ఓట్లు ఓటర్ల జాబితా నుండి మాయమయ్యాయి. 13 కోట్ల ఓట్లను ఎందుకు తీశారో చెప్పాలంటూ *సి జె పి* పార్టీ శనివారం జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు పిలుపునిస్తే, కేంద్రంలోని అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పీఠాలు కదిలినట్టు అయింది. నిరసన కార్యక్రమాన్ని నిరోధించడానికి నలభై ఐదు మెట్రో నిలయాలను మూసివేసి, అంతర్జాల సేవలను నిలిపివేసి, ఇరవై ఐదు వేల మంది పోలీసులను మోహరించింది. ఇది ప్రభుత్వ అధికార మదంతో చేసింది తప్ప బలం కాదు, పిరికితనం అని పెద్దపల్లి జిల్లా కు చెందిన కాంగ్రెస్ నాయకులు బిసి సంఘాల నాయకులు కందుల అశోక్ సీజేపీకి సంఘీభావం తెలుపుతూ, బిజెపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు కందుల అశోక్.

*సి జె పి* అంటే అణిచివేసినా తిరిగి లేచి సామాన్య ప్రజల హృదయాలను తట్టి లేపే యువగళం అన్నారు. దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో అడుగుతున్నది ఒక్కటే “నా ఓటు ఎక్కడ?” అని. ఈ ప్రశ్నకు భయపడి అధికార పక్షం ఢిల్లీని మూసివేసింది అన్నారు. *సి జె పి* యువ చైతన్యానికి దేశవ్యాప్తంగా మద్దతు వచ్చింది అన్నారు. సిజెపి పార్టీ చేపట్టిన బృహత్ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా నుండి ప్రజల పక్షాన అండగా నిలుస్తానన్నారు. సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అన్నారు. . ఇది పదవుల కోసం చేసే పోరాటం కాదు, ఓటు హక్కు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం *సి జె పి* పడుతున్న ఆరాటం అన్నారు.

ప్రధాన డిమాండ్లు

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి. ఎన్నికల సంఘం లోపలే కారణం.. తప్పు జరిగిందని స్వయంగా అధికారులే చెబుతుంటే ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అనార్హుడు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.

పదమూడు కోట్ల ఓట్లు ఎలా మాయమయ్యాయి? పార్లమెంటులో ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి.
ఢిల్లీని అధికార మదంతో పోలీసులచే దిగ్బంధం చేసినంత మాత్రాన దేశవ్యాప్తంగా మూట కట్టుకున్న నిరసనను ఆపలేరన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, జరిగిన పొరపాటున సవరించి కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలని కందుల అశోక్ డిమాండ్ చేశారు. లేనట్లయితే ఓటు హక్కు పరిరక్షణ కోసం గల్లీ నుంచి మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.