అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి) : చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్‌ చేశారు. మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని రాజన్న ఆరోపించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలిచేలా చర్యలు తీసుకోవాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి టి. సదానందం, సీపీఎం జిల్లా నాయకుడు బిక్షపతి, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకుడు గుమ్మడి వెంకన్న, న్యూడెమోక్రసీ నాయకులు ఈ. నరేష్‌, చిలుక శంకర్‌, బి. అశోక్‌, తోకల రమేష్‌, ఐ. రాజేశం తదితరులు పాల్గొన్నారు.