అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
పాత్రికేయుని జన్మదినం సందర్భంగా రోగులకి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ.
పాత్రికేయుడు జంగపల్లి సాగర్ జన్మదినం సందర్భంగా, పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్,బ్రెడ్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ది క్రైమ్ న్యూస్ రిపోర్టర్ జంగపల్లి సాగర్ జన్మదిన సందర్భంగా రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం ఎంతో మంచి కార్యక్రమం అని, ఎవరి జన్మదినం జరిగిన కేకులు కట్ చేసుకోవడం, ఆడంబరాలు, సంబరాలు జరుపుకుంటున్న రోజుల్లో ఈయన అలా చేయకుండా ఇలా నిరుపేదలకు ఎంతోకొంత ఆకలి తీర్చే విధంగా సేవ చేయడం అభినందనీయమని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన సాగర్ ని ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ అహేమద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండ్లరమేష్, గంధంసతీష్, జంగపెల్లినరేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
