పోచమ్మ గుడికి చేరిన మహిళా సంఘం పంచాయతీ.. తడి బట్టలతో శపథానికి సిద్ధమైన మహిళలు!

పెద్దపల్లి మండలంలో ఆసక్తికర ఘటన.. వినాయక నిమజ్జనం వల్ల వాయిదా…!

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళా సంఘానికి సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం, గ్రామంలోని గ్రూప్ మహిళల బ్యాంకు రుణాల చెల్లింపులు రూ. 26300 వేల రూపాయల వివాదం voa,csp మధ్య కోలుకున్న ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇప్పుడు ఊరంతా హాట్ టాపిక్ గా మారింది. లెక్కల తేడాతో మొదలైన ఈచిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి చివరకు పోచమ్మ గుడి వరకు వెళ్లింది.

అసలేం జరిగింది..?

గ్రామానికి చెందిన ఓ మహిళా సంఘానికి సంబంధించి నెలనెల తిరిగి చెల్లించే రుణాలు voa/ గ్రూప్ సభ్యులు , csp/bank కు రూ. 26300 వేల నగదు చెల్లింపు విషయంలో వివాదం నెలకొంది. సంబంధిత గ్రూప్ కు చెందిన VOA (గ్రామ సమాఖ్య కార్యకర్త) 2026 ఫిబ్రవరి నెలలో ఆ డబ్బులను గ్రామంలోని CSP సెంటర్ లో చెల్లించానని చెపుతుంది.
కానీ CSP సెంటర్ నిర్వాహకురాలు మాత్రం “ఆ నెలలో నాకు అసలు డబ్బులే ఇవ్వలేదు” అన్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్యల లెక్క తేలని ఆ రూ. 26300 ఎటు పోయాయో తేల్చలేక సంఘ సభ్యులు తల పట్టుకుంటున్నారు.
ఈ వివాదం మొదట గ్రూప్ లో, తర్వాత VO లో, ఆ తర్వాత ఊరి పెద్దలు, సర్పంచ్ వరకు వెళ్లింది. ఎవరెంత చెప్పినా ఇద్దరూ తమ మాటకే కట్టుబడి ఉండటంతో చివరకు పంచాయతీ ఊరి నడిబొడ్డున ఉన్న పోచమ్మ గుడి వరకు చేరింది.

పోచమ్మ గుడిలో తడి బట్టలతో బండారు!

తప్పు చేసిన వారిని గుర్తించడానికి తెలంగాణ సంప్రదాయం ప్రకారం.. పోచమ్మ గుడిలో బండారు తీయడం అనేది చాలా చోట్ల ఆచారం. దేవుడు ముందు అబద్ధం ఆడాలని నమ్మకం.
గ్రామ పెద్దలు ఇరువురినీ పిలిచి ” ఇక మనిషి మాటలు కాదు.. దేవుడి మీద ఒట్టు వేయండి” అని తీర్పు ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా తడి బట్టలతో తానం చేసి పోచమ్మ గుడిలో బండారు తీసి నిజం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ విషయం వినాయక నిమజ్జనం ఉన్నందున పెద్ద మనుషులు శుక్రవారానికి వాయిదా వేసినట్లు సమాచారం.

మరి శుక్రవారం పోచమ్మ గుడిలో ఎవరు బండారు తీస్తారు? రూ. 26300 వేల మతలబు ఏమిటో బయటపడుతుందా? అసలు డబ్బులు తిన్నదెవరు? తిరిగి కట్టేది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
26300 వేలకే దేవుడి వరకు వెళ్లాల్సి రావడం, గ్రామంలో చర్చ జరుగుతోంది.
ఇంత జరుగుతున్న ఆ శాఖ అధికారులకు తెలవదా…? తెలవకుండా ఉంటుందా..!. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఇరువురు పరస్పర ఆరోపణలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

ఇలాంటి కార్యకలాపాలు ఈ ఒక్క సంఘం మీదనే కాకుండా జిల్లాలోని చాలా సంఘాల పైన ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మహిళా సంఘాల్లో పారదర్శకత లేకపోవడంపై గతంలో ఆరోపణలు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రతి సంఘాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.

ఇదే అంశంపై అగ్నిధార పూర్తి సమాచారం త్వరలో  …