సాగర్ రోడ్ లో 6 క్వింటాళ్లు బియ్యం సీజ్

కేసులు నమోదు చేసిన అధికారులు.

రేషన్ బియ్యం పక్కదారి పడితే పనిష్మెంట్ తప్పదు.

పెద్దపల్లి అగ్నిధార న్యూస్: తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చాలలే సత్సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకంలో అక్రమార్కులు చేరి పందికొక్కుల బియ్యాన్ని పక్కకు తోడుతున్నారు. అర్హులకు అందాల్సిన PDS బియ్యం పక్కదారి పట్టదనే ఉద్దేశంతో అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

పెద్దపల్లి జిల్లాలో అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు,
సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో అక్రమం బియ్యం నిల్వ ఉన్నాయని విశ్వసనీయ సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టగా 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.

పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం కొందరికి వ్యాపార మార్గం గా తయారైంది. సన్నబియ్యాన్ని వినియోగదారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెద్దపల్లి సాగర్ రోడ్డులోని ఓ ఇంటిలో జిల్లా పౌరసరఫరాల అధికారి (District Civil Supplies Officer) కె. శ్రీనాథ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.i

తనిఖీల్లో – 23 బ్యాగుల బియ్యం స్వాధీనం

పెద్దపల్లి సివిల్ సప్లై అధికారులకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం,
పట్టణంలోని సాగర్ రోడ్ లో గల ఇంటి నంబర్ 3-3-136/A/1 లో pds బియ్యం నిలువ ఉన్నాయని తెలిసింది. దీనితో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే రేషన్ బియ్యం (ప్రజా పంపిణీ వ్యవస్థ Public Distribution System) ద్వారా వచ్చే PDS Rice ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

పిడిఎస్ బియ్యం ప్యాకేజీ బ్యాగులు

అధికారులు వెళ్లేసరికి బజ్జూరి శంకర్, పీడీఎస్ సన్నబియ్యాన్ని సాధారణ ప్యాకేజీ బ్యాగుల్లోకి మారుస్తూ (Repacking) చేస్తూ కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో 23 బ్యాగుల్లో ఉన్న సుమారు 600 కిలోల (6 క్వింటాళ్లు) PDS సన్న బియ్యం ఉన్నట్లు గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

పిడిఎస్ బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ కు తరలింపు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పిడిఎస్ బియ్యాన్ని భద్రత కోసం స్థానిక MLS Point కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

6-A కేసు నమోదు – పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

అక్రమ వ్యాపారులు కొందరు తమ స్వప్రయోజనాల కోసం పేదల బియ్యాన్ని తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్మడం చట్టరీత్యా నేరం. అని తెలిసి కూడా బజ్జూరి శంకర్ ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు, నిత్యవసర సరుకుల చట్టం (Essential Commodities Act) కింద 6-A కేసు నమోదు చేశారు. దీనితో పాటు క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తెలిపారు.

ఈ దాడుల్లో DTCS పోచయ్య, CSI రాజిరెడ్డి, ETF కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో ఇలాంటి అక్రమ నిల్వలపై తనిఖీలు కొనసాగుతాయని అధికారి హెచ్చరించారు.

Agni Dhara Reporter Chegonda Ravi Kumar Yadav Peddapalli District source DPR peddapalli