పెద్దపల్లిలో 10 కొత్త వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
ఏసంగి పంట మొక్కజొన్న, శనగలు వేయండి.
ప్రభుత్వ విప్ విజయ రమణారావు కీలక ప్రకటన.
పెద్దపల్లి గ్రామీణం, నవంబర్ 2 ( అగ్నిధార ) పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు శుభవార్త,పెద్దపల్లి మండలం లోని పెద్దబొంకూర్,కొత్తపల్లి,ములసాల,భోజన్నపేట, చీకురాయి,హన్మంతునిపేట,మారేడుగొండ,గుర్రంపల్లి,పెద్దపల్లి,చందపల్లి, గ్రామాల్లో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) అధ్యక్షులు ముత్యాల నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులతో విప్ విజయ రమణారావు మాట్లాడిన మాటలు రైతుల్లో భరోసా నింపాయి.
10 రోజుల నీళ్లు పంటల కాపాడాయి ప్రభుత్వ విప్:
పెద్దపల్లి జిల్లాతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనే సదుద్దేశంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ఒప్పించి కాలువ నీళ్లను పది రోజులు వచ్చేలా చర్యలు చేపట్టాం అన్నారు. పాలు తాగే దశలో ఉన్న వరి పొలాలు,కాలువలు,వాగుల ద్వారా ఆయకట్టు చివరి మడి వరకు కాల్వల ద్వారా నీళ్లు గనక అప్పుడు ఇవ్వకుంటే జిల్లాలో రెండు లక్షల పదిహేను వేల ఎకరాలలో సగం పంటలు ఎండిపోయేవి అన్నారు. అవి నీళ్లు పంటలను కాపాడై అన్నారు. సరైన టైంలో నీళ్లు అందకుంటే, రైతులకు కోట్లలో నష్టం జరిగేది అని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది అన్నారు. అది చూస్తే నాకు సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు.

ఏసంగీకి ఎల్ నినో ఎఫెక్ట్ – ఆరుతడి పంటలే బెటర్
రానున్న ఏసంగి సీజన్ లో రైతులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు . ఈసారి ఎల్ నినో ప్రభావం ఉన్నందున వర్షాభావ పరిస్థితులు వచ్చే అవకాశం తక్కువ అన్నారు. చెరువులు కుంటల్లో నీళ్లు ఉండవన్నారు. భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అని తెలిపారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు తీవ్రస్థాయిలో పడిపోతాయి కాబట్టి, రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలు వేయాలి అని సూచించారు. వరికి బదులు మొక్కజొన్న, శనగలు లాంటి పంటలు వేస్తే నష్టం ఉండదు అన్నారు. వాటికి మద్దతు ధర వచ్చే విధంగా నేను ప్రభుత్వంతో మాట్లాడి చూసుకుంటా అని రైతులకు భరోసించారు. మీరు ధైర్యంగా ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని భరోసా ఇచ్చారు.
41 కిలోల నిబంధన – ఒక్క గింజ ఎక్కువ వద్దు
వరి ధాన్యం తూకం విషయంలో రైతులకు క్లారిటీ భరోసా ఇచ్చారు. ఒక బస్తాకు 41 కిలోలు మాత్రమే జోకాలి అని స్పష్టం చేశారు. అంతకంటే ఒక గింజ ఎక్కువ తూకం పెట్టద్దు అని సెంటర్ నిర్వాహకులను హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎక్కువ తూకం జోకితే నాకు ఫోన్ చేయండి అని రైతులకు సూచించారు.
కేంద్రాలలో అవకతవకలు జరిగితే చర్యలు – నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు గట్టి హెచ్చరిక చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు నష్టం కలిగించే విధంగా, అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు అంటూ హెచ్చరించారు. గతంలో కొన్ని సెంటర్ల నిర్వాహకులు అక్కడక్కడ తప్పిదాలు చేశారు అన్నారు. అలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకూడదు చూసుకోవాలన్నారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు.
వ్యాపారులతో జాగ్రత్త – ఫోన్ పే, గూగుల్ పే అంటే నమ్మొద్దు.
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ తో కలిపి మద్దతు ధర2962 ఇస్తుంది అన్నారు. ఒకవేళ ప్రభుత్వ ధర కంటే ఎక్కువ డబ్బులు వస్తే రైతుల ఇష్టం మేరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవచ్చు అన్నారు. కానీ నేను రైతు బిడ్డగా శ్రేయోభిలాషిగా చెప్తున్నా,నగదు డబ్బులు వస్తేనే ఇవ్వండి. ఫోన్ పే, గూగుల్ పే లో పంపిస్తా అంటే నమ్మొద్దు, డబ్బుల కోసం వ్యాపారులు రైతులను తిప్పించుకునే ప్రమాదం ఉంది అని రైతులకు ముందస్తుగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆశపడి మోసపోవద్దు ఈ తప్పు చేయొద్దన్నారు. పైసలు ఇటు – వడ్లు అటు అనే విధంగా ఉండాలి అని రైతులకు కీలక సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేష్, స్థానిక సర్పంచులు రైతులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
