పారదర్శకత, సత్వర సేవలే లక్ష్యమని వెల్లడి.

అందుబాటులో ఉంటా బాకం ఓం ప్రకాష్

పెద్దపల్లి, నవంబర్ 6 (అగ్నిధార న్యూస్)

పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు కొంతకాలంగా ఖాళీగా ఉంది. జిల్లా ప్రధాన కేంద్రం కావడం రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓం ప్రకాష్ గతంలో విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధత, పరిపాలనా దక్షత, ప్రజలతో మెలిగే తీరును పరిగణనలోకి తీసుకుని పెద్దపల్లి కార్యాలయ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విధి నిర్వహణలో ప్రత్యేక ముద్ర –

సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన బి. ఓం ప్రకాష్ కేవలం రొటీన్ విధులకే పరిమితం కాకుండా, కార్యాలయ సమగ్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. అక్కడ పనిచేసిన సమయంలో కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి, , సరైన మౌలిక సదుపాయాలు లేక ఉద్యోగులు విధులు నిర్వహించడానికి, ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం రావడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు.
ఆ సమయంలో సమస్యను గుర్తించిన ఓం ప్రకాష్, వెంటనే చొరవ తీసుకుని ఉన్నతాధికా దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, కార్యాలయానికి అవసరమైన మరమ్మతులు, తాగునీటి సదుపాయం, కూర్చునే ఏర్పాట్లు, రికార్డు రూమ్ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కోసం కృషి చేశారు.

ఆయన కృషి ఫలితంగా సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రూపురేఖలే మారిపోయాయి. కార్యాలయ వాతావరణం మెరుగుపడటంతో ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించడంతో పాటు, ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా తమ రిజిస్ట్రేషన్ పనులు చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు. ఆయన తీసుకున్న ఈ చొరవను స్థానిక ప్రజలు, అభినందించారు.

పెద్దపల్లిలోనూ అదే స్ఫూర్తి కొనసాగిస్తా – బి. ఓం ప్రకాష్

పెద్దపల్లి సబ్ రిజిస్టర్ బాధ్యతల స్వీకరణ బి. ఓం ప్రకాష్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి పెద్దపల్లి వంటి కీలకమైన కార్యాలయ బాధ్యతలు అప్పగించిన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.

“పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒకరికి నిబంధనలకు లోబడి పారదర్శకమైన, జవాబుదారీతనంతో , సత్వర సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూస్తాను అన్నారు. స్లాట్ బుకింగ్ నుండి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ, వినియోగదారుల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను అన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ, శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించేలా కృషి చేస్తాను అని ప్రకటనలు తెలిపారు. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం, క్రమశిక్షణ, సమయపాలన, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాను” అని స్పష్టం చేశారు.

అనుభవజ్ఞుడైన అధికారి బి. ఓం ప్రకాష్ పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టడం పెద్దపల్లి జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేవలు మరింత మెరుగుపడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు…

చేగండ రవి కుమార్ యాదవ్ అగ్నిధార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా