అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం.
అన్ని వర్గాలకు సమన్యాయం ఆశావాహులకు గుర్తింపు.
క్షేత్రస్థాయిలో దూకుడు పెంచనున్న కాంగ్రెస్ పార్టీ .
హైదరాబాద్, నవంబర్ 9 (అగ్నిధార న్యూస్):
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) చైర్మన్ మీడియా & పబ్లిసిటీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ 26 మంది అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు.
ఎప్పుడెప్పుడా అని పార్టీ పదవుల కోసం ఎదురు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు దీపావళి మరుసటి రోజు తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమాభివృద్ధినీ ప్రజల్లోకి వాణిని మరింత బలంగా వినిపించేందుకు ఏకంగా 26 మంది నేతలతో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల జాబితాను ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత నూతన ఉత్సాహాన్ని, జోష్ ను నింపిందని చెప్పవచ్చు .
టీపీసీసీ మీడియా పబ్లిసిటీ విభాగం చైర్మన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నవంబర్ 9న గాంధీభవన్, హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల (స్పోక్స్ మెన్) జాబితాను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజా సమస్యల నేపథ్యంలో పార్టీ గొంతుకను మరింత దూకుడుగా వినిపించాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తుంది.
ఆశావాహులకు అన్ని వర్గాలకు పెద్దపీట
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాల నాయకులను సమన్యాయం చేయడం. ఇందులో మహిళా నేతలకు పెద్దపీట వేయడంతో పాటు, యువతకు, పార్టీ సీనియర్ నేతలకు, న్యాయవాదులకు, విద్యావంతులకు, తెలంగాణ ఉద్యమకారులకు, గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం కష్టకాలంలో చెమటోడ్చిన కార్యకర్తలకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం.ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమ కాలంలో పార్టీతో ఉండి తెలంగాణ సాధించుకున్న నుండి మొదలు నేటి వరకు పార్టీ జెండాను భుజాన మోస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడిన, పోరాడుతున్న నేతల సేవలను త్యాగాలను గుర్తించి వారికి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.
వారి పాత్ర ఏమిటి?
నూతనంగా నియామకమైన ఈ 26 మంది అధికార ప్రతినిధులు ఇక నుండి ప్రజా సమస్యలపై ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సమాచార సాధనాలను ఉపయోగించుకుంటూ వారి వారి పరిధిలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ, జాతీయ, రాష్ట్ర మీడియాలో, సోషల్ మీడియా వేదికగా, టీవీ చానల్స్ లో చర్చల్లో పాల్గొంటూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు.

పూర్తి జాబితా వివరాలు:
ఈ జాబితాలో గడ్డల హైమావతి, సుంకరి మల్లేష్ గౌడ్, దివ్య వాణి, బి.ఎన్. రెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్, అనితా జక్కని, బోయ నాగేష్, కొట్ల శ్రీనివాస్, నంగి దేవేందర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ రెడ్డి, డా. బోడేపూడి రాజా, పెరిక శ్యామ్, నుమాన్ మహమ్మద్, కె. నేహా రెడ్డి, కమలాకర్ మేడగోని, రేఖా గౌడ్, గిరి కొండల్ రెడ్డి, పర్రెపాటి యుగంధర్, పద్మ, చింతల నిర్మలా రెడ్డి, నాగలక్ష్మి, వాసిరెడ్డి నరేష్, వంగాల వెంకన్న గౌడ్, ఎస్.కె. సిరాజ్ హుస్సేన్, షేక్ ముక్తార్ అహ్మద్ మరియు రూపా ఉన్నారు. ఎప్పటినుండో పార్టీ కోసం చేస్తున్న నిస్వార్థ సేవలకు, త్యాగాలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవకాశాన్ని వారు సమర్థవంతంగా నిర్వహించి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరింత బలమైన శక్తిగా నిలుపుతారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
